ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. శుక్రవారం విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోందని చెబుతోంది టీమ్. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో ధర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మా మూవీ గురించి ట్వీట్ చేసిన సాయిదుర్గ తేజ్ అన్నకు థ్యాంక్స్. అలాగే నాకు హీరోగా అవకాశం ఇచ్చిన మా ముగ్గురు ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్. వాళ్లను లైఫ్‌లో మర్చిపోను. ఈ సినిమాతో నేను యూత్‌ను చెడగొట్టలేదు అనే పేరొచ్చింది చాలు. మంచి మెసేజ్‌తో మూవీ చేశాం.
మహిళలకు, ఫ్యామిలీస్‌కు మూవీ నచ్చడం సంతోషంగా ఉంది. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్స్‌ను ఉచితంగా ఇవ్వబోతున్నా. కొందరు ఫస్టాఫ్ బాగుందని, మరికొందరు సెకండాఫ్ బాగుందని అంటున్నారు. ఏరియా వైజ్‌గా రెస్పాన్స్ చూస్తే అందరి దగ్గర నుంచి మూవీ బాగుందనే టాక్ వస్తోంది’ అని చెప్పాడు. ప్రేక్షకులతో కలిసి సినిమా చూశానని, ఫన్, ఎమోషన్ చూసి ఆనంద పడ్డానని చెప్పింది ఐశ్వర్య శర్మ. డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ ‘మనం జీవితంలో చేసే తప్పులు ఆలస్యంగా తెలుసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలా ఎవరి లైఫ్‌లో జరగొద్దు అనే మంచి సందేశాన్నిస్తూ ఈ మూవీ తీశా’ అని చెప్పాడు. మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉందని నిర్మాతలు అన్నారు.