ముంబై ఎయిర్ పోర్టులో భారీగా ఖరీదైన ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎయిర్ పోర్టులో పార్సిల్స్ ను తనిఖీలు చేసిన డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 42.86 కోట్లు విలువ చేసే 3646 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్సిల్ హాంకాంగ్ నుంచి ముంబైకు వచ్చినట్లు గుర్తించారు. పార్సిల్ పై ఉన్న చిరునామా ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. మెమోరీ కార్డులో ముసుగులో ఐఫోన్లను తరలించేందుకు ప్రయత్నించారు. అయితే దీనిపై కేసు నమోదు చేసిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కస్టమ్స్ యాక్ట్ ప్రకారం యాపిల్ ఫోన్లను దిగుమతి చేసుకోకపోవడంతో వాటిని అధికారులు సీజ్ చేశారు.
Directorate of Revenue Intelligence (DRI) caught 3,646 iPhone-13 smartphones at Mumbai airport that were being smuggled into India from Singapore in two consignments on Nov 26. The total value of the seized goods is around Rs 42.86 crores: DRI pic.twitter.com/pioMg0Pz3W
— ANI (@ANI) November 28, 2021
