పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో.. DRDO గైడెడ్​ పినాక ఆయుధ వ్యవస్థ

భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో) గైడెడ్​ పినాక వెపన్​ సిస్టమ్​ విమాన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొవిజనల్​ స్టాఫ్​ క్వాలిటేటివ్​ రిక్వైర్​మెంట్స్​(పీఎస్​క్యూఆర్​) ధ్రువీకరణ ప్రయోగాల్లో భాగంగా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ పరీక్షల్లో భాగంగా పీఎస్​క్యూఆర్ పారామితులైన రేంజింగ్​, కచ్చితత్వం, స్థిరత్వం తదితర అంశాలను విస్తృతమైన పరీక్ష ద్వారా అంచనా వేస్తుంది. రెండు ఇన్ సర్వీస్ పినాక లాంచర్ల ద్వారా ఒక్కో ప్రొడక్షన్​ ఏజెన్సీ నుంచి 12 రాకెట్లను పరీక్షించింది. ఒరిజినల్​ పినాక మల్టీ బ్యారెల్​ రాకెట్​ లాంచర్​ ఆయుధ వ్యవస్థ(ఎంబీఆర్ఎల్​)కు ఇది అప్​గ్రేడెడ్​ వెర్షన్​. 

ప్రత్యేకతలు 

గైడెడ్​ పినాక మల్టిపుల్​ లాంచ్​రాకెట్​సిస్టమ్​ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) లేబోరేటరీ ఆర్మెంట్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఎస్టాబ్లిష్​మెంట్​(ఏఆర్​డీఈ) అభివృద్ధి చేసింది. కేవలం 44 సెకండ్లలో మొత్తం 12 రాకెట్లను ఫైర్ చేయగలదు. ఈ సిస్టమ్700 X 500 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేయగలదు. ఒక బ్యాటరీ మొత్తం 72 రాకెట్లను ధ్వంసం చేయగలదు. 

పినాక లాంచర్ల ద్వారా ప్రయోగించే రాకెట్లు ఏకకాలంలో 75 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ఒక్కో రాకెట్​ హై ఎక్స్​ప్లోజివ్​, యాంటీ ట్యాంక్​ బాంబ్లెట్స్, యాంటీ పర్సనల్​ మైన్స్ సహా పలు వార్ మేడ్​ రకాలను మోసుకెళ్లవచ్చు. ఇప్పటికే ఆర్మేనియా సహా మరికొన్ని దేశాలు పినాకను కొనుగోలు చేసేందుకు భారత్​తో ఒప్పందం చేసుకున్నాయి. 

గతంలో ప్రయోగించినవి

పినాకను మొదటిసారిగా కార్గిల్​యుద్ధంలో ఉపయోగించారు.
పినాక ఎంకే 1: బేసిక్​ వెర్షన్. దీని రేంజ్ 38 కి.మీ.
పినాక ఎంకే 32: దీని రేంజ్ 60 కి.మీ.

సంస్థలు స్థాపకులు

సంస్థ    సం.    స్థాపకులు 

యంగ్​మెన్స్​ ఇంప్రూవ్​మెంట్​ సొసైటీ    1879    అఘోరనాథ చటోపాధ్యాయ
హిందూ సోషల్​ క్లబ్    1888    రాజా మురళీ మనోహర్​
ఆర్యసమాజ్​ హైదరాబాద్​ శాఖ    1892    కమలా ప్రసాద్​, లక్ష్మణ్​ దేశ్​జీ
దివ్యజ్ఞాన సమాజం హైదరాబాద్​ శాఖ    1905-06    -
ఆంధ్ర విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి    1900    కొమర్రాజు లక్ష్మణరావు
జగన్ మిత్ర మండలి    1906    భాగ్యరెడ్డి వర్మ
మన్యం సంఘం    1911    భాగ్యరెడ్డి వర్మ
హ్యుమానిటేరియన్​ లీగ్​    1913    రాయ్ బాలముకుంద్​, లాల్​జీ మేఘ్​జీ
బ్రహ్మ సమాజం మొదటి సమావేశం    1914    నారాయణ గోవింద వెల్లాంకర్​
హైదరాబాద్​ సోషల్​ సర్వీస్​ లీగ్​    1915    వామన్​రావు నాయక్, 
        కేశవరావు కోరాట్కర్​
హైదరాబాద్​ యువకుల సంఘం    1916    వామన్​రావు నాయక్​
హైదరాబాద్​ ఎడ్యుకేషన్ సొసైటీ    1915    మౌల్వీ మహ్మద్​ ముర్తజా
ఆది హిందూ సోషల్​ సర్వీస్​ లీగ్​    1922    భాగ్యరెడ్డి వర్మ
ఆది హిందూ ద్రవిడ సంఘం    1922    బి.ఎస్​.వెంకట్రావు 
ఆంధ్ర జన సంఘం    1922    కేవీ రంగారెడ్డి