వివర్స్ కాలనీలో డ్రైనేజీ పూడ్చేశారు..!

గద్వాల, వెలుగు : ప్రజల పన్నులతో రూ.లక్షలు ఖర్చుపెట్టి కట్టిన డ్రైనేజీలను దర్జాగా పూడ్చివేసినా పట్టించుకోని పరిస్థితి గద్వాల మున్సిపాలిటీలో కనిపిస్తున్నది. వివర్స్ కాలనీలోని డీఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించారు. 

వాటి ద్వారా మురుగు, వర్షపు నీరు బయటకు వెళ్లాలి. కానీ, కొందరు డ్రైనేజీ మొత్తాన్ని పూడ్చివేసి నిర్మాణాలు చేపట్టడంతో మురుగ బయటకు పోలేని పరిస్థితి నెలకొన్నది. దీనిపై చర్యలు తీసుకొని కాలనీవాసులు కోరుతున్నారు.