డాక్టర్ రెడ్డీస్​ చేతికి జర్మనీ కంపెనీ

డాక్టర్ రెడ్డీస్​ చేతికి జర్మనీ కంపెనీ

హైదరాబాద్​, వెలుగు: జర్మనీకి చెందిన నింబస్​ హెల్త్​ ను కొనుగోలు చేసేందుకు డెఫినిటివ్​ అగ్రిమెంట్​కుదుర్చుకున్నామని హైదరాబాద్​ ఫార్మా కంపెనీ డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​ ప్రకటించింది. ఈ లైసెన్సెడ్​ ఫార్మా హోల్​సేలర్​ గంజాయి ఆధారిత డ్రగ్స్​పై ఫోకస్​ చేస్తోంది. అయితే ఈ డీల్​ విలువను డాక్టర్​ రెడ్డీస్​ బయటపెట్టలేదు. నింబస్​ తమ చేతికి రావడం వల్ల గంజాయి ఆధారిత మెడిసిన్స్​ను పేషెంట్లకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. సాధారణ మందులతో నయం కాని చాలా రోగాలకు గంజాయిని ట్రీట్​మెంట్​గా వాడుతున్నారని, ముఖ్యంగా నొప్పులను తగ్గించడంలో ఈ రకం ట్రీట్​మెంట్లు బాగా పనిచేస్తాయని డాక్టర్ రెడ్డీస్​ యూరోపియన్ జెనరిక్స్​ హెడ్​ పాట్రిక్​ అఘానియన్​ చెప్పారు. ఇక నుంచి నింబస్​ తమకు హోల్లీ ఓన్డ్‌ సబ్సిడరీగా ఉంటుందని చెప్పారు. జర్మనీలో మెడికల్​ గంజాయి మార్కెట్​ విలువ గత ఏడాది 122 మిలియన్ యూరోలుగా రికార్డయింది.