న్యూఢిల్లీలోని ఐఏఆర్ఐ డైరెక్టర్గా డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావు నియామకం

రాజేంద్రనగర్ లోని నార్మ్ (NAARM - National Academy of Agricultural Research Management- ) డైరెక్టర్ గా విధులు నిర్వహించే డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు..  న్యూఢిల్లీలోని ఐఏఆర్ఐ డైరెక్టర్ గా నియమితులయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆయన గత ఎనిమిదేళ్లుగా రాజేంద్రనగర్ లోని నార్మ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఐ సి ఏ ఆర్  లో అంతర్భాగమైన ఐ ఏ ఆర్ ఐ  ( ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ ) డైరెక్టర్ గా నియమితులయన తొలి తెలుగు వ్యక్తి శ్రీనివాసరావు కావడం విశేషం.

ALSO READ | కులగణనతో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తయ్: మహేశ్ కుమార్ గౌడ్

శ్రీనివాసరావు స్థానంలో నార్మ్ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించే రామ సుబ్రహ్మణ్యం ఇన్చార్జి డైరెక్టర్ గా కొనసాగనున్నట్లు నార్మ్ ప్రజా సంబంధాల అధికారిణి (PRO) అనీజా గుత్తికొండ ఓ ప్రకటనలో వెల్లడించారు.