ఎన్‌‌‌‌ఐఎన్ నూతన డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా డాక్టర్ భారతి కులకర్ణి

సికింద్రాబాద్, వెలుగు: తార్నాకలోని నేషనల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ న్యూట్రీషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఐఎన్) నూతన డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా సీనియర్ సైంటిస్టు డాక్టర్ భారతి కులకర్ణి నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సెంటర్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. 

డాక్టర్ భారతి కులకర్ణి పుణె యూనివర్సిటీ నుంచి పీడియాట్రిక్స్‌‌‌‌లో పట్టా పొందారు. అనంతరం అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్కూల్ నుంచి పబ్లిక్ హెల్త్‌‌‌‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్‌‌‌‌డీ పూర్తి చేశారు. 

గత 20 ఏండ్లుగా ఎన్‌‌‌‌ఐఎన్‌‌‌‌లో సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్న ఆమె.. గత మూడేండ్లుగా ఢిల్లీలోని ఐసీఎంఆర్సెంటర్‌‌‌‌‌‌‌‌లో పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం పోషకాహార విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నారు. డాక్టర్ భారతి రక్తహీనత, చైల్డ్ మాల్ న్యూట్రీషన్, ఎనీమియా, పిల్లల్లో పోషకాహార లోపాలు, ఆరోగ్య సమస్యులు, అగ్రికల్చర్ న్యూట్రీషన్ లింకేజెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. ఆమె చేసిన పరిశోధనలకు గాను జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు.