యూఐడీఏఐ (UIDAI) జారీ చేసే 12 అంకెల విశిష్ట గుర్తింపు కార్డుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతొక్కరికీ ఆధార్ కార్డు కంపల్సరీగా మారిపోయింది. దేశంలో ఓ వ్యక్తి సమాచారం అయినా.. ఆధార్ కార్డు ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. ప్రభుత్వ పథకాలు, గ్యాస్, మంచినీటి, ఫోన్ కనెక్షన్ ఇలా.. ఏదీ అవసరం పడినా.. వీటికి ఆధార్ జత చేయాల్సి ఉంది. అయితే.. కొన్ని సార్లు ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్రస్, పేరు.. ఇలా మార్పులు చేసుకోవాల్సి వస్తే.. ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఈ విషయంలో UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే ఆధార్ సేవలు అందుబాటులోకి తేవాలని లెటెస్ట్ గా నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను.. దాదాపు 4 వేల పోస్టుమేన్ లకు శిక్షణ ఇస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ఇంటింటికి వెళ్లి మొబైల్ నెంబర్ లతో ఆధార్ నెంబర్ లింక్ చేయడం, వివరాలను పొందుపర్చడం.. ఇతరత్రా వాటిపై వారికి శిక్షణనిస్తున్నారు.
వీలైనంత ఎక్కువ మంది పౌరులను నమోదు చేయడం కోసం శిక్షణనివ్వడం జరుగుతోందని సీనియర్ అధికారి వెల్లడించారు. పిల్లల నమోదు కోసం టాబ్లెట్, మొబైల్ లను ఉపయోగించడం జరుగుతోందని, ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ లను ఉపయోగించి.. ఆధార్ వివరాలను అప్ డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పోస్ట్ మేన్, CSC బ్యాంకింగ్ కరస్పాండెంట్ లు సేకరించిన వివరాలు, అప్ డేట్ చేసిన ఆధార్ వివరాలను వేగంగా అప్ డేట్ అయ్యేలా 755 జిల్లాల్లో ఆధార్ సేవ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం 72 నగరాల్లో 88 UIDAI సేవా కేంద్రాలున్నట్లు, సుదూర ప్రాంతాలకు చేరుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. UIDAI దేశంలోని అన్ని 7 వేల 224 బ్లాక్ లలో మినీ ఆధార్ సేవ కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తోందన్నారు. మొబైల్, పాన్ లను ఆధార్ కు లింక్ చేయడం, ఫోన్ నెంబర్, చిరునామ వంటి వివరాలను అప్ డేట్ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు UIDAIకి సహకరిస్తాయని ఆశిస్తున్నామన్నారు.
మరిన్ని వార్తల కోసం : -
గోల్డెన్ టెంపుల్ వద్ద భారీ బందోబస్తు
రేపు సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించనున్న రాహుల్
