జయ ఫొటోలతోనే స్టాలిన్ స్కూల్ బ్యాగుల పంపిణీ

జయ ఫొటోలతోనే స్టాలిన్ స్కూల్ బ్యాగుల పంపిణీ

కొత్తగా ఏపార్టీ అధికారంలోకి వచ్చినా...అంతకు ముందు ఉన్న ప్రభుత్వ పథకాలను,స్కీంలను అంతగా పట్టించుకోవు. అధికారంలోకి వచ్చిన పార్టీ కొత్తగా స్కీంలను ప్రారంభిస్తాయి. దీంతో ఆ పథకాల ప్రభావం ప్రభుత్వ ఖజానాపై పడుతుంది. ఆదాయానికి గండి పడుతుంది. ఇది కామన్ గా జరిగేది. కానీ..తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం గొప్ప నిర్ణయం తీసుకొని అందరికి ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన 65లక్షల స్కూల్ బ్యాగ్ లపై మాజీ సీఎంలు జయలలిత,ఎడప్పాడి పళనిస్వామి ఫొటోలు ఉన్నాయి.

అయితే వాటిని పక్కకు పెట్టకుండా అవే కొనసాగించాలని స్టాలిన్ నిర్ణయం తీసుకున్నాడు. మళ్లీ కొత్త బ్యాగులతో ప్రభుత్వ ఖజానా కు నష్టమే తప్ప లాభం లేదని..ఇలా ఆ బ్యాగులే ఇవ్వడంతో రాష్ట్ర ఖజానాకు రూ.13కోట్లు ఆదా అవుతాయని స్టాలిన్ నిర్ణయించారు. అలా ఆదా అయిన డబ్బుని విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టే మరో సంక్షేమ పథకంలో ఉపయోగించాలని తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోజికి సూచించారు.