అభిశంసన నుంచి గట్టెక్కిన ట్రంప్..

అభిశంసన నుంచి గట్టెక్కిన ట్రంప్..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన నుంచి బయటపడ్డారు. రెండో అభిశంసనలో భాగంగా సెనేట్ లో నిర్వహించిన ఓటింగ్ లో ట్రంప్ గట్టెక్కారు. ట్రంప్ పై అభిశంసన తీర్మానం నెగ్గాలంటే రెండు బై మూడో వంతు సభ్యుల మద్దతు అవసరం. కానీ ఆ మద్దతు లేకపోవడంతో ఆయనపై అభియోగాలు వీగిపోయాయి. మొత్తం 100 మంది సభ్యులు ఉండగా… ట్రంప్ పై అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటేశారు. దీంతో ట్రంప్ అభిశంసన నుంచి బయటపడ్డారు. ట్రంప్ కు వ్యతిరేకంగా ఆయన పార్టీ వాళ్లే ఏడుగురు ఓటేశారు. జనవరి 6న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచారనే ప్రకటన తర్వాత.. ఆయన  ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి చేశారు. వారిని ట్రంపే ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు.

వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు

జూబ్లీహిల్స్‌‌లో ఇల్లు కోసం రూ.41 కోట్లు