రామచంద్రాపురం,వెలుగు: కనిపించిన వారిపై దాడిచేస్తూ ఓ కుక్క గ్రామస్తులను హడలెత్తించింది. ఎదురొచ్చిన చిన్నారులపై దాడి చేసి గాయపరచడంతో స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యారు. ఈఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్మున్సిపల్పరిధిలో సోమవారం జరిగింది. తెల్లాపూర్‌లో ఒకే రోజు18 మందిపై కుక్క దాడి చేయడంతో స్థానికులంతా ఒక్క సారిగా భయానికి గురయ్యారు.
ఎలాగైనా కుక్కను పట్టుకోవాలని ప్రయత్నించినా కుక్క దొరకలేదు. దీంతో మున్సిపల్ సిబ్బందికి సమాచారమందించించారు. వారు కుక్కను పట్టుకునేందుకు ప్రయత్నించిన దొరకలేదు. కుక్క దాడిలో గాయపడినవారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్సనందించారు. గాయపరుస్తున్న కుక్కను త్వరగా పట్టుకోవాలని మున్సిపల్ సిబ్బందిని స్థానికులు కోరారు.