అల్లు అర్జున్కు స్టేషన్ బెయిల్ వస్తుందా లేదా కోర్టులో హాజరు పరుస్తారా..?

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసమే అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా లేక కోర్టులో హాజరుపరుస్తారా అనే చర్చ జరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ను తన ఇంటి వద్ద విచారణ కోసం చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలోనే పీఎస్కు తరలించారు. అల్లు అర్జున్ పై BNS 105, 118 (1), రెడ్ విత్ 3/5 కింద  కేసులు నమోదయ్యాయి.  


అరెస్టు సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహ:


అరెస్టు సమయంలో అల్లు ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అల్లు అర్జున్ భార్య కన్నీళ్లు పెట్టుకుంది. భార్య, కుటుంబ సభ్యులను ఓదార్చి పోలీసులతో విచారణకు బయలుదేరారు అల్లు అర్జున్.
 

Also Read : పోలీస్ వాహనంలోనే.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్

పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. బాబు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వక పోవడం వల్లనే ఈ ఘనట చోటుచేసుకుందని అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి.