పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు ఉండడంతో పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆసుపత్రుల్లో కరెంటు సరఫరా విషయంలో వైద్యులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి డాక్టర్లు సెల్ ఫోన్ టార్చ్ ను ఉపయోగించి చికిత్స చేస్తున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ససరామ్ జిల్లాలోని సదర్ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఓ రోగికి చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అదే సమయంలో కరెంటు పోవడంతో వైద్యులకు ఏమి చేయాలో అర్థం కాలేదు.
దీంతో తమ వద్దనున్న.. సెల్ ఫోన్ లు తీసుకుని టార్చర్ ఆన్ చేసి ఆ వెలుతురులో రోగికి చికిత్స చేశారు. ఈ ఘటనపై డాక్టర్ బ్రిజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఆసుపత్రిలో కొన్ని సమస్యలున్నాయని, విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రతి రోజు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. మరి ఈ ఘటన తర్వాత విద్యుత్ కోతలు లేకుండా అధికారులు చూస్తారా అనేది చూడాలి.
Bihar | Doctors treat patients in the Emergency ward using mobile phone lights due to lack of power supply in Sasaram district
— ANI (@ANI) June 4, 2022
Due to some issues, there are frequent power cuts in the hospital. We have to deal with such a situation every day: Dr Brijesh Kumar, Sadar Hospital pic.twitter.com/Yo1GCVwac2
మరిన్ని వార్తల కోసం : -
ట్రెండింగ్ లో #HBDFatherOfCorruption హాష్ ట్యాగ్
చెట్టు మీద పండ్లను ఇలా కోయచ్చా..! ఫిదా అయిన మహీంద్రా
