1973లో ప్రాజెక్ట్​ టైగర్ గురించి మీకు తెలుసా?

    భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న సహజ వారసత్వ ప్రదేశం పశ్చిమ కనుమలు.

    1973లో ప్రాజెక్ట్​ టైగర్​ను ప్రారంభించారు.
    తెలంగాణలో ఉన్న టైగర్​ రిజర్వుల సంఖ్య 2.
    అసోం రాష్ట్రంలో ఓరంగ్​ టైగర్​ రిజర్వ్ ఉంది. 
    దేశంలోని మొత్తం టైగర్ రిజర్వుల సంఖ్య 55.
    2022లో ప్రకటించిన చివరి టైగర్​ రిజర్వ్​ మాలె మహదేశ్వర హిల్స్​.
    ప్రస్తుతం దేశంలో అతిపెద్ద టైగర్​ రిజర్వు 
    నాగార్జునసాగర్ శ్రీశైలం.
    మన దేశంలో అత్యధిక టైగర్​ రిజర్వులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్​.
    బ్రహ్మపుత్ర నదీ ఒడ్డున ఉన్న టైగర్​ రిజర్వు ఓరంగ్​.
    దేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన టైగర్​ రిజర్వు జిమ్​ కార్బెట్​ నేషనల్​ పార్క్​.
    టైగర్​ సెన్సెస్​ 2018 ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య 2967.
    టైగర్​ సెన్సస్​ 2018 ప్రకారం పులుల సంఖ్యలో వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్​.
    ప్రపంచంలో పులులను అధికంగా కలిగిన మొదటి మూడు దేశాలు ఇండియా, రష్యా, ఇండోనేషియా.
    పన్నా టైగర్​ రిజర్వు కెన్​ – బెట్వా నదుల లింక్​ వల్ల ముంపునకు గురవుతుంది. 
    2018 జాతీయ పులుల గణన ప్రకారం తెలంగాణలో పులుల సంఖ్య 26.
    భారతదేశంలో మొదటిసారిగా పులుల గణన చేపట్టిన సంవత్సరం 2006.
    భారతదేశంలో పులుల ఆవాస ప్రాంతాలు ఆరు సహజసిద్ధ భూ ప్రదేశాలు (ల్యాండ్​స్కేప్స్​)గా విభజించారు. అయితే, వీటిలో అత్యధికంగా 1008 ఉన్న ల్యాండ్​ స్కేప్​ మధ్య భారతదేశం, తూర్పు కనుమలు.
    తెల్లపులి జన్మస్థానం( సహజ ఆవాస ప్రాంతం)గా మధ్యప్రదేశ్​లోని రేవా ప్రాంతాన్ని పేర్కొంటారు.
    ప్రాజెక్ట్​ రెడ్​ పాండాను 1996లో పద్మజానాయుడు నేషనల్​ పార్క్​లో ప్రారంభించారు. 
    రెండ్​ పాండా సిక్కిం రాష్ట్ర జంతువు.
    ఇండియన్​ రైనో విజన్​ని 2005లో ప్రారంభించారు.
    గౌహతి పట్టణ జంతువుగా డాల్ఫిన్​ను ప్రకటించింది.
    ప్రాజెక్ట్​ ఎలిఫెంట్​ 1992లో ప్రారంభమైంది.
    2023, జనవరి నాటికి దేశంలోని మొత్తం ఎలిఫెంట్​ రిజర్వుల సంఖ్య 33.
    హాథీ మేరీ సాథీ అనేది ఏనుగు సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమం.
    2017 ఏనుగుల జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఏనుగుల సంఖ్య 27,312.
    అత్యధిక ఏనుగుల జనాభా కలిగిన రాష్ట్రం కర్ణాటక.
    ప్రాజెక్ట్​ చీతా 2009లో ప్రవేశపెట్టారు.
    ఏషియాటిక్​ లయన్​ జనాభా లెక్కలు 1936లో ప్రారంభించారు. 
    గిర్​ ప్రాంతంలో ఆసియా సింహాలు అధికంగా ఉన్నాయి.
    2020 ఏసియాటిక్​ లయన్​ జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఉన్న మొత్తం ఆసియా సింహాల సంఖ్య 674.
    గహిర్​ మాతా బీచ్​ ప్రాంతంలో ఆలీవ్​రిడ్లే తాబేళ్లు సంరక్షించబడుతున్నాయి.
    ట్యూటికోరన్​ బీచ్​ ప్రాంతంలో హాక్స్​బెల్​ తాబేళ్లను సంరక్షిస్తున్నారు.
    రామ్సర్​ చిత్తడి నేలల నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం చిత్తడి నేలల సంఖ్య 75.
    భారతదేశంలో అతిపెద్ద చిత్తడినేలలు సుందర్​బన్స్​.
    భారతదేశంలో అత్యధిక చిత్తడినేలలు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్​.
    రామ్స​ర్​ అనేది ఇరాన్​లోని ఒక పట్టణం.
    దేశంలో అతి చిన్న చిత్తడి నేల రేణుక. 
    దేశంలో మొదటి చిత్తడి నేల బితర్​కనిక.
    ప్రపంచంలో ఆసియా ఏనుగులు అత్యధిక సంఖ్యలో కలిగిన దేశం భారతదేశం.
    బితర్​కనిక నేషనల్​ పార్క్​ ఒడిశా రాష్ట్రంలో ఉంది.
    మిజోరాంలో ఉన్న జాతీయ పార్క్​ ముర్లేన్​.
    భారత అడవుల చట్టం 1927లో చేశారు.
    మన దేశంలో మొదటిగా ఎలిఫెంట్​ కాలనీ కలిగిన రిజర్వు బాందవ్​ ఘర్​ రిజర్వ్​.