ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..!ఈ బ్యాంకులోని 50 బ్రాంచీలను మూసేస్తున్నారు

ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..!ఈ బ్యాంకులోని 50 బ్రాంచీలను మూసేస్తున్నారు

హేతుబద్ధీకరణ ప్రయత్నంలో భాగంగా 50 బ్రాంచీలను మూసివేస్తున్నట్లు ఎస్ బ్యాంక్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. కొత్త ఓపెనింగ్స్ లేనందున ఫైనాన్షియల్ ఇయర్ – 21 లో మొత్తం నెట్‌వర్క్‌ను తగ్గిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ త్రైమాసికంలో నిర్వహణ వ్యయాన్ని 21 శాతం తగ్గిస్తున్నట్లు  తెలిపారు. ఇందులో భాగంగా  సెంట్రల్ ముంబైలోని ఇండియాబుల్స్ ఫైనాన్స్ సెంటర్‌లో బ్యాంక్ ఇప్పటికే రెండు అంతస్తులను అమ్మేసినట్లు చెప్పిన ఆయన.. కార్పొరేట్ కార్యాలయాలు అలాగే ఉన్నాయన్నారు. దీంతో పాటు  మొత్తం 1100 శాఖలకు అద్దె చెల్లించేలా చర్చలు జరిపినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం తమ బ్యాంక్ అద్దెలను తగ్గించడమే ప్రధాన లక్ష్యమన్నారు.  ఫైనాన్షియల్ ఇయర్ – 2022 లో ఎస్ బ్యాంక్ ను విస్తరిస్తామన్నారు.  బ్రాంచ్‌ల పై ఆధారపడకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను ప్రోత్సహిస్తామన్నారు ఎస్ బ్యాంక్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్.