బల్దియాలో గ్రామాలను విలీనం చేయొద్దు

  • విలీనానికి వ్యతిరేకంగా కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీర్మానం 
  • డివిజన్ల  సమస్యలను ఏకరువు పెట్టిన కార్పొరేటర్లు
  • పెండింగ్ పనులు పూర్తి చేస్తాం : మేయర్ సునీల్ రావు 

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 గ్రామాలు, కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ పాలకవర్గం సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. మేయర్ సునీల్ రావు అధ్యక్షతన శనివారం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇప్పటికే నగరపాలక సంస్థలో సరిపోను నిధుల్లేక గతంలో విలీనం చేసిన 8 గ్రామాల ప్రజలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేక పోతున్నామని, మళ్లీ శివారు గ్రామాల విలీనంతో ప్రజలకు అన్యాయం జరగడంతో పాటు బల్దియా సంస్థ మీద భారం పడుతుందని సభ్యులు కోరినట్లు మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు వెల్లడించారు.

ఈ సందర్భంగా పలు ఎజెండా అంశాలపై చర్చ జరిగింది. ఇందులో గ్రామాల విలీనంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్ సిటీకి చాలా దూరంగా ఉందని, దుర్షేడు, బొమ్మకల్  వ్యవసాయాధారిత గ్రామాలని, వీటిలో రైతులు, కూలీలు ఎక్కువగా ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే బొమ్మకల్, గోపాల్ పూర్, దుర్శేడ్​ను ఒక మున్సిపాలిటీగా, చింతకుంట, మల్కాపూర్ గ్రామాలను ఒక మున్సిపాలిటీ చేయొచ్చని సూచించారు. 

పదవీకాలం ముగుస్తుంది..పనులు చేయండి.. 

‘మా పదవీ కాలం ముగుస్తుంది. చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. చాలా ఏరియాల్లో లైట్లు వెలగడం లేదు. ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తీర్చండి’ అంటూ కార్పొరేటర్లు జీరో అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కమిషనర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్ దృష్టికి తీసుకెళ్లారు. పలు పెండింగ్ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యను సభ దృష్టికి తెచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే నత్తనడకన సాగుతోందని, ఒక్కో డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదనంగా 
ఒకరిని నియమించాలన్నారు.

సభ దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మేయర్ హామీ ఇచ్చారు. నగరంలో చేపట్టిన సీఎం అస్యూరెన్స్ అభివృద్ధి పనులను కూడా ఈ వారంలో ప్రారంభించి పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ సూచన మేరకు కళాభారతిని కళాకారులకు రూ.3వేలు, ఇతరులకు రూ.5 వేలకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. 

కరీంనగర్ డెయిరీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేతపై కార్పొరేటర్ ఫైర్ 

రీఅసెస్ మెంట్ చేయకపోవడంతో కరీంనగర్ డెయిరీ యాజమాన్యం సుమారు రూ.20 లక్షల మేర ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొడుతోందని ఇటీవల ‘వీ6 వెలుగు’ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పబ్లిష్ అయిన కథనాన్ని కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ సభ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే రీఅసెస్ మెంట్ చేసి ట్యాక్స్ వసూలు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కమిషనర్ చాహత్ బాజపాయ్ మూడు రోజుల్లో రీఅసెస్ మెంట్ చేసి ట్యాక్స్ విధిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప హరిశంకర్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.