ఈవీఎం ర్యాండమైజేషన్​లో పొరపాట్లు జరగవద్దు

వనపర్తి, వెలుగు: ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంల ర్యాండమైజేషన్​లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  సూచించారు. ఆదివారం చిట్యాల వ్యవసాయ మార్కెట్  యార్డు గోదామ్​లో ఈవీఎంలను తనిఖీ చేశారు. అనంతరం అసిస్టెంట్​రిటర్నింగ్  ఆఫీసర్​ ఎం నగేశ్​ పర్యవేక్షణలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సెక్టార్  ఆఫీసర్లు ఈవీఎంల ర్యాండమైజేషన్​ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాక్ పోలింగ్  నిర్వహించి పోలింగ్  డే కోసం ఈవీఎంలను సిద్ధం చేయాలని ఆదేశించారు.