కొత్త ఏడాదిలో ఈ తేదీలు యాది మరవద్దు

కొత్త ఏడాదిలో ఈ తేదీలు యాది మరవద్దు
బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: కరోనా సంక్షోభంతో 2020 లోని చాలా ఫైనాన్షియల్‌‌ డెడ్‌‌లైన్స్‌‌ను ప్రభుత్వం కొత్త ఏడాదికి పొడిగించింది. ప్రభుత్వం తెచ్చిన స్కీమ్‌‌ల ప్రయోజనాలను పొందేందుకు, పెనాల్టీ భారాన్ని తప్పించుకునేందుకు ఈ డెడ్‌‌లైన్‌‌లను గుర్తుపెట్టుకోవడం అవసరం.  ఈ ఏడాది ముఖ్యమైన ఫైనాన్షియల్ యాక్టివిటీల చివరితేదీలు కింద ఉన్నాయి.. జనవరి 10: 2019-20  ఐటీఆర్ ఫైలింగ్‌‌కు.. ఆర్థిక సంవత్సరం 2019–20 కి సంబంధించి ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రిటర్న్‌‌లను ఇంకా ఫైల్‌‌ చేయకపోతే జనవరి 10 వరకు టైమ్‌‌ ఉంది. ఈ డెడ్‌‌లైన్‌‌ లోపు ఎటువంటి లేట్‌‌ ఫీజు లేకుండా ఉద్యోగులు,ఆడిట్‌‌ అవసరం కాని ఇండివిడ్యువల్స్‌‌  ఐటీఆర్‌‌‌‌లను ఫైల్‌‌ చేసుకోవచ్చు. ఈ డెడ్‌‌లైన్‌‌ను కూడా మిస్ అయితే పెనాల్టీ కింద రూ. 10 వేలు కట్టాల్సి ఉంటుంది. జనవరి 15: ట్యాక్స్‌‌ ఆడిట్‌‌ రిపోర్ట్ డెడ్‌‌లైన్‌‌ ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ చట్టం కింద సబ్మిట్‌‌ చేయాల్సిన ఆడిట్ రిపోర్ట్‌‌లకు జనవరి 15 చివరి తేది. ఆర్థిక సంవత్సరం 2019–20 లో ఇంటర్నేషనల్‌‌, నిర్ధిష్టమైన డొమెస్టిక్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఆడిట్‌‌ రిపోర్ట్‌‌లను, ట్యాక్స్ ఆడిట్‌‌ రిపోర్ట్‌‌లను ఈ డెడ్‌‌లైన్‌‌ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జనవరి 31: వివాద్‌‌ సే విశ్వాస్ స్కీమ్‌‌ డిక్లరేషన్‌‌ ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ వివాదాలను తగ్గించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాద్‌‌ సే విశ్వాస్‌‌ స్కీమ్‌‌కు డిక్లరేషన్‌‌ను ఫైల్‌‌ చేయడానికి జనవరి 31 చివరి తేది. ఫిబ్రవరి 15: ఆడిట్‌‌ అకౌంట్ల ఐటీఆర్‌‌ ఫైలింగ్‌‌.. 2019–20 కి సంబంధించి ఆడిటింగ్‌‌ అవసరమున్న ఇండివిడ్యువల్‌‌ అకౌంట్లు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఫిబ్రవరి 15 చివరి తేది. లేదా ఇన్‌‌కమ్‌‌ ట్యాక్‌‌ చట్టం ప్రకారం ఆడిట్‌‌ రిపోర్ట్‌‌లను సబ్మిట్‌‌ చేసే ఇండివిడ్యువల్స్‌‌కు ఇదే చివరి తేది. ఫిబ్రవరి 28: పెన్షన్‌‌ లైఫ్‌‌ సర్టిఫికేట్‌‌.. పెన్షన్‌‌ కోసం సీనియర్ సిటిజన్లు ఫిబ్రవరి 28 లోపు లైఫ్‌‌ సర్టిఫికేట్‌‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2020, నవంబర్‌‌‌‌ 30 తో ముగియాల్సిన ఈ డేట్‌‌ను ప్రభుత్వం పొడిగించింది. ఈ డేట్‌‌ లోపు లైఫ్‌‌ సర్టిఫికేట్‌‌ సబ్మిట్‌‌ చేయలేకపోతే పెన్షనర్లకు పెన్షన్‌‌ రాదు. మార్చి 15: అడ్వాన్స్‌‌ ట్యాక్స్ పేమెంట్లకు డెడ్‌‌లైన్.. డివిడెండ్లపై ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ను 2020, ఏప్రిల్ 1 నుంచి ఇన్వెస్టర్లపైనే విధిస్తున్నారు. డివిడెండ్‌‌ ఇన్‌‌కమ్‌‌పై ఇన్వెస్టర్‌‌‌‌ ఏ ట్యాక్స్‌‌ స్లాబ్‌‌కు వస్తాడో ఆ ట్యాక్స్‌‌ రేటు పడుతుంది. దీనికి అదనంగా ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌లో డివిడెండ్‌‌ ఇన్‌‌కమ్‌‌ రూ. 5 వేలకు మించితే టీడీఎస్‌‌ను ఇన్వెస్టర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2020–21 లో పెద్ద మొత్తంలో డివిడెండ్‌‌ ఇన్‌‌కమ్‌‌ను పొందినట్టయితే ఆ ఇండివిడ్యువల్‌‌ అడ్వాన్స్‌‌ ట్యాక్స్‌‌ పేమెంట్స్‌‌ కట్టాల్సి ఉంటుంది. కాగా, ఒక ఆర్థిక సంవత్సరంలో  అంచనావేసిన మొత్తం ట్యాక్స్ పేమెంట్స్‌‌ నుంచి టీడీఎస్‌‌ను మినహాయించగా మిగిలిన ట్యాక్స్‌‌ పేమెంట్‌‌ రూ. 10 వేలకు మించి ఉంటే అడ్వాన్స్‌‌ ట్యాక్స్‌‌ను కట్టాల్సి ఉంటుంది. అడ్వాన్స్‌‌ ట్యాక్స్‌‌ పేమెంట్లను మార్చి 15 లోపు చెల్లించలేకపోతే అదనపు చార్జీలు పడతాయి. డెడ్‌‌లైన్‌‌..మార్చి 31 మార్చి 31 తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుందన్న విషయం తెలిసిందే. పాన్‌‌ కార్డ్‌‌తో ఆధార్‌‌‌‌ కార్డును లింక్‌‌ చేయడానికి మార్చి 31 చివరి తేది. పాన్‌‌–ఆధార్‌‌‌‌లు  లింక్‌‌ అవ్వకపోతే పాన్‌‌ కార్డు పనిచేయదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌‌కు పాన్‌‌ కార్డును వినియోగించడానికి వీలుండదు. కానీ ఆధార్‌‌‌‌ కార్డును లింక్ చేయగానే తిరిగి పాన్‌‌ కార్డు పనిచేస్తుంది. ఎల్‌‌టీసీ క్యాష్‌‌ వోచర్‌‌‌‌ స్కీమ్‌‌ కింద బెనిఫిట్స్‌‌ పొందడానికి మార్చి 31 నే చివరి తేది. కన్జూమర్ డిమాండ్ పెంచేందుకు ఇప్పటి వరకు క్లెయిమ్‌‌ చేసుకోని లీవ్‌‌ ట్రావెల్‌‌ అలోవెన్స్‌‌(ఎల్‌‌టీఏ)లను వాడుకునేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్‌‌ను 2020 అక్టోబర్‌‌‌‌లో తీసుకొచ్చింది. ఆడిటింగ్‌‌ అవసరం లేని ఇండివిడ్యువల్స్‌‌ 2019-20 కి గాను ఐటీఆర్‌‌‌‌లను జనవరి 10 లోపు ఫైల్‌‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ డేట్‌‌ను మిస్‌‌ అయిన వారు తమ లేటు ఐటీఆర్‌‌‌‌ లేదా సవరించిన ఐటీఆర్‌‌‌‌లను మార్చి 31 లోపు సబ్మిట్‌‌  చేయాలి. ఈ ఐటీఆర్‌‌‌‌లను ఫైల్‌‌ చేసే ఇండివిడ్యువల్స్‌‌ లేటు ఫీజు కింద రూ. 10 వేలు కట్టాల్సి ఉంటుంది. అదే చిన్న ట్యాక్స్‌‌ పేయర్లయితే రూ. 1000 లోపే లేటు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 10 లోపు ఫైల్‌‌ అయిన ఐటీఆర్‌‌‌‌లలో తప్పులున్న వారు కూడా తాము సవరించిన రిటర్న్‌‌లను తిరిగి ఫైల్‌‌ చేయడానికి మార్చి 31 చివరి తేది. ఆర్థిక సంవత్సరం 2020–21 కి గాను ట్యాక్స్‌‌ సేవింగ్‌‌ ఎక్స్‌‌ర్‌‌‌‌సైజ్‌‌ను పూర్తి చేయడానికి మార్చి 31 డెడ్‌‌లైన్‌‌. దీన్ని మిస్‌‌ అయితే ట్యాక్స్‌‌ పేయర్లు తమ ట్యాక్స్ పేమెంట్లను తగ్గించుకునే అవకాశాన్ని కోల్పోతారు. ప్రధాన్‌‌ మంత్రి ఆవాస్‌‌ యోజన కింద ప్రయోజనాలు పొందడానికి మార్చి 31 చివరి తేది. ఈ స్కీమ్‌‌ కింద రూ. 6 -8 లక్షల మధ్య లోన్లు తీసుకునే మిడిల్‌‌ క్లాస్‌‌ ఈ స్కీమ్‌‌ కింద రాయితీలను పొందొచ్చు. కొత్తగా ఇళ్లు కొనుక్కునేవారు ప్రభుత్వం ఇస్తున్న ట్యాక్స్ బెనిఫిట్స్‌‌ను పొందడానికి జూన్‌‌ 30 డెడ్‌‌లైన్‌‌. జనవరి 31 లోపు వివాద్‌‌ సే విశ్వాస్‌‌ స్కీమ్‌‌ డిక్లరేషన్‌‌ను ఫైల్‌‌ చేసిన వారు మార్చి 31 లోపు పేమెంట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. మార్చి 31 తో ఎమెర్జెన్సీ క్రెడిట్‌‌ లైన్ గ్యారెంటీ స్కీమ్‌‌ ముగుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి వడ్డీలేకుండానే రూ. 10 వేలను అడ్వాన్స్‌‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెషల్‌‌ ఫెస్టివల్‌‌ అడ్వాన్స్‌‌ స్కీమ్‌‌ మార్చి 31 తో ముగుస్తుంది. 2020–21 కి సంబంధించి ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ను రిటర్న్‌‌లను ఫైల్‌‌ చేయడానికి జులై 31 చివరి తేది. ఇండివిడ్యువల్‌‌  ట్యాక్స్‌‌ పేయర్లు కొత్త ట్యాక్స్‌‌ విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కరోనా లాక్‌డౌన్‌ టైమ్​ కుటుంబాలకు మేలే చేసింది హైదరాబాద్‌లో చెట్టు కొట్టేసినందుకు రూ. 10 వేల ఫైన్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ ప్రొడక్ట్‌‌ల కోసం కొత్త ఈ-కామర్స్ పోర్టల్