రైల్వే ట్రాకుల వద్ద పతంగులు ఎగరేయొద్దు

  • సంక్రాంతి వస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సూచన 

హైదరాబాద్​సిటీ, వెలుగు: సంక్రాంతి సందర్భంగా రైల్వే ట్రాకుల వద్ద పతంగులు ఎగురేయొద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. రైల్వే ప్రాంగణాల్లోని యార్డులు, రైల్వే గేట్లు, ట్రాకుల సమీపంలో ఉన్న కరెంట్​తీగల వద్ద పతంగులు ఎగరేసి గతంలో చాలా మంది చనిపోయారని తెలిపారు. రైల్వేలోని ఓవర్‌‌‌‌‌‌‌‌హెడ్ లైన్లు అధిక వోల్టేజీతో చార్జ్ చేయబడి ఉంటాయని, కరెంట్​తీగల దగ్గర గాలిపటాలు ఎగురేస్తే వైర్లకు దారాలు తాకి హై వోల్జేజీ కరెంట్​షాక్​కు గురవుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా మాంజా, గాలి పటాల దారాలు విద్యుత్ వాహకంగా పనిచయడంతో త్వరగా షాక్ కు గురవుతుంటారని వెల్లడించారు.