న్యూఢిల్లీ: న్యూఇయర్ సందర్భంగా రూ.20 వేల విలువైన గిఫ్టు ఇస్తున్నామంటూ ఆన్లైన్లో వస్తున్న పోస్టులను నమ్మొద్దని రామ్రాజ్ కాటన్కస్టమర్లకు సూచించింది. కొందరు ఆకతాయిలు వాట్సప్ వంటి ఆన్లైన్లో ఫేక్ లింకులను పంపిస్తున్నారని తెలిపింది. తమ పేరును దెబ్బతీయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని, వాళ్లు పంపే లింకులను ఓపెన్ చేస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ చోరీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలాంటి సమస్యలకు తాము బాధ్యత వహించబోమని స్పష్టం చేసింది. పుకార్లు రేపిన వారిపై చట్టపరమైన చర్యల కోసం పోలీసులకు కంప్లయింట్ చేశామని రామ్రాజ్ ప్రకటించింది. క్రిస్మస్ పండుగ పేరుతోనూ ఇటీవల ఫేక్ లింకులను పంపిచారని తెలిపింది.
