ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించం: మంత్రి ఎస్. జైశంకర్

ముంబై: భారత్ తన లక్ష్యాలు, నిర్ణయాలలో ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తేల్చి చెప్పారు. ఇతర దేశాలకు ఇండియాలో ఎటువంటి వీటో అధికారం ఉండదని పేర్కొన్నారు. జాతీయ, ప్రపంచ ప్రయోజనాలకు ఏది సరైందో అదే చేస్తామన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి జైశంకర్ వీడియో సందేశాన్ని పంపించారు. 

“భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కానీ, భారతీయతను కోల్పోకుండా ముందుకు సాగాలి. అప్పుడే ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదగగలం. బెదిరింపులకు భయపడకుండా నిర్ణయాలు తీసుకుంటాం. పేదరికం, వివక్ష వంటి పాత సమస్యలను పరిష్కరించడంలో భారత్ గత దశాబ్దంలో ఎంతో పురోగతి సాధించింది’’ అని ఆయన వెల్లడించారు.