పోలియోను తరిమేద్దాం : జయ చంద్రమోహన్

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియోను సమూలంగా తరిమేసేందుకు సహకరించాలని డీఎంహెచ్ వో జయ చంద్రమోహన్  కోరారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్​ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. డీఐవో పరిమళ, మాస్  మీడియా ఇన్​చార్జి చంద్రయ్య, హెల్త్ ఎడ్యుకేటర్  మధు పాల్గొన్నారు.

గద్వాల: జిల్లాలోని ఐదేండ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని ఇన్​చార్జి డీఎంహెచ్ వో శశికళ సూచించారు. జమ్మిచేడ్ లో పల్స్​ పోలియోను ప్రారంభించారు. జిల్లాలో 73,870 మంది చిన్నారులను గుర్తించామని, వారందరికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. డాక్టర్  సిద్ధప్ప, స్రవంతి, మధుసూదన్ రెడ్డి, నరేంద్రబాబు, తిరుమలేశ్, వరలక్ష్మి పాల్గొన్నారు.
 

నాగర్ కర్నూల్: జిల్లాలో పల్స్​పోలియో ప్రోగ్రాం సక్సెస్​ అయిందని డీఎంహెచ్​వో సుధాకర్​లాల్​ తెలిపారు. జిల్లాలోని 89,439 పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి 613 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటుక బట్టీలు, సంచార జాతుల ఆవాసాల్లో పిల్లల కోసం 28 మొబైల్​ టీమ్​లను ఏర్పాటు చేశామన్నారు. 

నారాయణపేట: ఐదేండ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఐఎంఏ అధ్యక్షుడు మల్లికార్జున్, ట్రెజరర్​ గీత పిలుపునిచ్చారు. ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం పట్టణంలోని గవర్నమెంట్​ గర్ల్స్​ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన సెంటర్​లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం 125 మంది వ్యాక్సినేటర్లకు భోజనం ప్యాకెట్లను అందించారు. బాలాజీ రావ్ సింగాడే, గందె కార్తీక్, గగన్, అక్షిత, దీపిక, ప్రియాంక పాల్గొన్నారు.