ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెన్షన్ 

కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి సీహెచ్​సీలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్​ చేస్తూ డీఎంహెచ్​వో డాక్టర్ శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫీల్డ్ విజిట్​లో భాగంగా మంగళవారం కలెక్టర్ రాహుల్​ రాజ్​ కౌడిపల్లిలోని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అటెండెన్స్​ రిజిస్టర్​ను పరిశీలించగా మల్టీ పర్పస్​హెల్త్​ అసిస్టెంట్లు కే. రమేశ్, రాధాకృష్ణ, ఎంపీహెచ్​ఈవో అబ్దుల్ షకీల్ రిజిస్టర్​లో సంతకం చేసి విధులకు హాజరు కానట్టు గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డీఎంహెచ్​వోను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.