హైదరాబాద్​కు డీకే శివకుమార్ .. స్వాగతం పలికిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కర్నాటక డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్​ బుధవారం హైదరాబాద్​కు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఇతర నేతలతో కలిసి తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. 

ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్న డీకేకు మహేశ్ గౌడ్ శాలువా కప్పి, బొకే అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు..