శ్రీపర్వతాపూర్ మైసమ్మ ఆలయంలో ఎంపీ డీకే అరుణ పూజలు

నవాబుపేట,వెలుగు:మండలంలోని శ్రీపర్వతాపూర్​ మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని మహబూబ్​నగర్​ పార్లమెంట్​ సభ్యురాలు డీకే అరుణ గురువారం దర్శించుచుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం సిబ్బంది, అర్చకులు ఆమెకు   స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ఆమె అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలుందరూ  సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని, ప్రత్యేక కేంద్ర నిధులతో ఆలయ అభివృధ్దికి తన వంతుకృషిచేస్తానని  ఎంపి అరుణ ఈసందర్భంగా పేర్కొన్నారు.కార్యక్రమంలో బీజేపీ  జిల్లా నాయకులు శ్రీనివాస్​రెడ్డి,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.