గద్వాల బంగ్లా రాజకీయాలు చేసే దొరసాని డీకే అరుణ: చల్లా వంశీచంద్ రెడ్డి

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి. గద్వాల బంగ్లా రాజకీయాలు చేసే దొరసాని డీకే అరుణ అని విమర్శించారు. బీసీలను ఎదగనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ముదిరాజ్, యాదవ, కుర్మలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వారిని ఓడించేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. 

నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో వంశీచంద్ పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూటకో పార్టీ మార్చే అవకాశవాద దొరసాని అని విమర్శించారు. నారయణపేటకు వచ్చిన సైనిక్ స్కూల్  వెళ్తుంటే స్పందించలేదని ఫైర్ అయ్యారు. పదవుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని చెప్పారు.  

కొడంగల్ నారయణపేట నియోజకవర్గాలు రెండూ రెవంత్ రెడ్డి కళ్లు లాంటివని అన్నారు. రూ.5 వేల కోట్లతో కొడంగల్ లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. జీవో 69 తెచ్చి రూ. 2 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. త్వరలో వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రాబోతుందని చెప్పారు.  చిట్టెం నర్సిరెడ్డి సంగం బండ ప్రాజెక్టు ప్రారంభమైతుందని వంశీచంద్ రెడ్డి తెలిపారు.