కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచి ఏం చేసినవ్ రేవంత్ : డీకే అరుణ

కొడంగల్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి.. నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు మహబూబ్నగర్  బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. పేదలకు సంక్షేమ పథాకాలు అందాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. నారాయణపేట జిల్లాలో నర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే అరుణ.  దామరగిద్ద మండలం సజనాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో కర్నార్ మీటింగ్ లో పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ పాలనలో సబ్సిడీ పథకం కింద గొల్ల కురుమలకు గొర్రెలు అందిస్తామని మోసం చేశారని ఆరోపించారు డీకే అరుణ. కేంద్రం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, స్మశాన వాటికలు నిర్మించారన్నారు.  రామరాజ్యం కావాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాల్సిందేనని చెప్పారు.  ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో  ఆమె మాట్లాడుతూ ఉపాధి కూలీ డబ్బులు పెంచింది బీజేపీనే అని ఎన్నికల్లో బీజేపకి ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే మహబూబ్నగర్  ను  అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు డీకే అరుణ.