మాగనూర్ మండలంలోని గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం

మాగనూర్, వెలుగు: ఉమ్మడి మాగనూర్  మండలంలోని వడ్వాట్, అడవి సత్యారం, కోల్పూర్, ముడుమాల్ గుడేబల్లూర్, కృష్ణ, కున్సీ, కొత్తపల్లి, మాగనూర్ గ్రామాల్లో గురువారం బీజేపీ ఎంపీ క్యాండిడేట్  డీకే అరుణ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని ఎవరో నిర్ణయించే ఓటు అనే భావనతో ఓటేయాలన్నారు. ఆడబిడ్డను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సంక్షేమ పాలనలో మోదీ ప్రపంచానికే ఆదర్శమని పేర్కొన్నారు. కొండయ్య, ఎంపీపీ శ్యామలమ్మ, మండల అధ్యక్షుడు నారాయణ ఉన్నారు.