బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ

పాలమూరు, వెలుగు: బీజేపీ మహబూబ్ నగర్  ఎంపీ క్యాండిడేట్​గా డీకే అరుణను ఆ పార్టీ హైకమాండ్  బుధవారం ప్రకటించింది. పాలమూరు నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, స్టేట్​ ట్రెజరర్​ బండారు శాంతికుమార్  తమవంతు ప్రయత్నాలు చేశారు. టికెట్  కోసం ఎవరికి వారు హైకమాండ్ వద్దకు వెళ్లి అవకాశం ఇవ్వాలని కోరారు. ఫస్ట్  లిస్టులో మహబూబ్ నగర్ అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండడం, వీరంతా సీనియర్లు కావడంతో ఖరారు చేయలేదు.