డీకే అరుణ vs వంశీచంద్​ రెడ్డి .. ఎదురుపడిన అభ్యర్థులు

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీచంద్​ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండల కేంద్రంలో ఒకేసారి రోడ్​ షో నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు అభ్యర్థులు ఎదురుపడడంతో ఇరుపార్టీల కార్యకర్తలు తమ లీడర్లకు అనుకూలంగా పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.  మండల కేంద్రంలో కొద్దిసేపు టెన్షన్​ వాతావరణం నెలకొంది. రెండు పార్టీలకు చెందిన లీడర్లకు పోలీసులు నచ్చచెప్పి పక్కకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.