సీఎం రేవంత్‌‌‌‌వి డైవర్షన్‌‌‌‌ పాలిటిక్స్

  • కొడంగల్​మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి డైవర్షన్‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌ చేస్తున్నారని కొడంగల్​మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి విమర్శించారు. వికారాబాద్‌‌‌‌ జిల్లా పరిగిలోని మాజీఎమ్మెల్యే మహేశ్‌‌‌‌రెడ్డి ఇంట్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. అల్లుఅర్జున్‌‌‌‌ కేసుపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అసెంబ్లీలో గంటసేపు మాట్లాడడం సరైందేనా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నా... అవన్నీ పక్కనపెట్టి అల్లు అర్జున్‌‌‌‌ విషయానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నారు. 

37 రోజులు తనను జైల్లో పెట్టి రేవంత్‌‌‌‌రెడ్డి పైశాచిక ఆనందం పొందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటనలో ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో తన పేరు లేకుండా, అరెస్ట్ వారెంట్‌‌‌‌ లేకుండా తనను అరెస్ట్‌‌‌‌ చేయడం కక్ష సాధింపు కాదా ? అని ప్రశ్నించారు. లగచర్ల ఘటనలో కేటీఆర్‌‌‌‌ను ఇరికించే ప్రయత్నం చేశారని, అది విఫలం కావడంతో ఫార్ములా కార్‌‌‌‌ రేసింగ్‌‌‌‌లో అక్రమం జరిగిందని కేటీఆర్‌‌‌‌పై కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు పెట్టి, నిర్బంధించి మాట్లాడకుండా చేయాలన్నదే సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రయత్నం అని విమర్శించారు. సంధ్య థియేటర్‌‌‌‌ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం అని, తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని అల్లు అర్జున్‌‌‌‌ ఆదుకోవాలని, హాస్పిటల్‌‌‌‌లో ఉన్న శ్రీతేజ్‌‌‌‌ కోలుకునే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరారు. పరిగి మాజీఎమ్మెల్యే మహేశ్వర్‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ముకుంద అశోక్, నాయకులు ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌, అంతిగారి సురేందర్ పాల్గొన్నారు.