క్రిస్టియన్​ మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు : ఇలియాజ్ అహ్మద్

  • ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా త్వరలో పంపిణీ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీస్ కార్పొరేషన్ ద్వారా హైదరాబాద్ జిల్లాలోని మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద త్వరలో ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా www.tgobmms.cgg.gov.in ద్వారా అప్లికేషన్లు సమర్పించాలని సూచించారు. ఒక ఇంటికి ఒక కుట్టు మిషన్ ఇస్తామని, దరఖాస్తుదారు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుంచి టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ పొంది ఉండాలన్నారు.

 సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాలని వెల్లడించారు. అలాగే కనీసం 5 తరగతి చదివి, వయస్సు 18 నుంచి 55 ఏండ్ల మధ్య ఉండాలన్నారు. వితంతువులు, అనాథలు, ఒంటరి, పేద, నిరుపేద మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. తెల్ల రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు లేదా రూ.2 లక్షల లోపు ఇన్​కమ్​సర్టిఫికెట్​సమర్పించాలని స్పష్టం చేశారు.