నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి : రమేశ్​ చంద్ర 

ఉప్పునుంతల, వెలుగు: నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని   జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్​ డాక్టర్ రమేశ్​చంద్ర సూచించారు. మండల కేంద్రంలోని ఆసుపత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. జూన్ మొదటి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి కావలసిన అన్ని పరికరాలు, వసతుల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్​ ఆఫీసర్లు డాక్టర్ రమాకాంత్, డాక్టర్ శివ లీల, ఫార్మసిస్ట్ శ్రీనివాసులు పాల్గొన్నారు.