ఆగ్రా: అవును మీరు చదివింది నిజమే. కృష్ణుడి విగ్రహానికి చేయి విరిగితే తల్లడిల్లిపోయిన పూజారి, ఆ విగ్రహాన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. అక్కడి సిబ్బంది కూడా ‘శ్రీకృష్ణ’ పేరుతో పేషెంట్పేరు నమోదు చేసుకొని కట్టు కట్టి పంపించారు. ఈ సంఘటన ఆగ్రా జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన లేఖ్సింగ్.. అర్జున్నగర్ లోని ఓ టెంపుల్లో 30 ఏండ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాడు. నిత్యపూజల్లో భాగంగా శుక్రవారం బాల గోపాలుడికి స్నానం చేయిస్తుంటే ఓ చేయి విరిగింది. దీంతో తల్లడిల్లిపోయిన లేఖ్సింగ్ వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. బాలగోపాలుడికి చేయి విరిగింది కట్టు కట్టాలని కోరగా.. స్టాఫ్ అవాక్కయ్యారు. పూజారి ఏడుస్తుండడంతో.. డాక్టర్లు చేయి విరిగిన విగ్రహానికి కట్టు కట్టారు. భక్తుడి మనోభవాలను కాదనలేక కట్టు కట్టినట్లు డాక్టర్లు చెప్పారు.
