ప్రజావాణి దరఖాస్తులపై దృష్టిపెట్టాలి

  •  ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులపై దృష్టిపెట్టాలని కలెక్టర్​మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 49 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు 66 కిలోమీటర్ల మేర జరుగుతున్న జాతీయ రహదారి పనుల్లో నిర్లక్ష్యం జరుగుతుందని వెంటనే కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన ఆరే శరత్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. 

సిద్దిపేట పట్టణంలోని జయశంకర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుకునే ప్లేయర్స్ కు ఫీజు రూపంలో ఒక్కొక్కరికి రూ.800 చొప్పున తీసుకుంటున్నారని, ఇతర జిల్లాలో కేవలం రూ.200 నుంచి రూ. 400 మాత్రమే తీసుకుంటున్నారని ఇక్కడ కూడా తక్కువ తీసుకోవాలని కోరుతూ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, ఇతర  శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డి టౌన్ : ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ అధికారుల పని అని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్​వో పద్మజారాణి, ఆర్డీవో రవీందర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. మొత్తం 72 వినతులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో రెవెన్యూ 24, సర్వే ల్యాండ్ రికార్డు 9, పంచాయతీరాజ్ 9, డీఆర్డీవో 7, మున్సిపల్ 4, వివిధ సంక్షేమ శాఖలు 9, ఇతర శాఖలకు సంబంధించి10 దరఖాస్తులు ఉన్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మెదక్​ టౌన్ : ప్రజావాణికి వచ్చిన అర్జీలు, దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్​కలెక్టర్​నగేశ్ అధికారులకు సూచించారు. మెదక్​కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 72 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ధరణి-18, పింఛన్లు- 4, ఇందిరమ్మ ఇండ్లు 18,, రుణమాఫీ 7-, ఇతర సమస్యలు 25 ఉన్నాయన్నారు. అనంతరం తూప్రాన్​ మండలంలోని ఇస్లాంపూర్​జీపీలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సెక్రటరీ కల్పన, మాజీ సర్పంచ్ సుకన్య, ఫీల్డ్​ అసిస్టెంట్​నర్సింలుపై చర్యలు తీసుకోవాలని పలువురు గ్రామస్తులు అడిషనల్​కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డీఆర్​వో భుజంగరావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్​రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.