సమస్యలు పరిష్కరించండి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

  • ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్ఓ పద్మజారాణి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు 65 దరఖాస్తులు అందజేశారు. 

సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదాన్ సమీపంలో గల దళితుల పట్టా భూములను ఎఫ్ టి ఎల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు దుర్గ ప్రసాద్ భూ బాధితులు మానేయ రాములు భరత్ సునీలతో కలిసి జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను, పదేళ్ల క్రితం అదనపు కట్ట పోసి ఊరు డ్రైనేజీని పట్టా భూముల్లోకి వదిలి నిలువ ఉంచి ఎఫ్ టి ఎల్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని గతంలో హెచ్ఎండిఏ అధికారులు ఎఫ్టిఎల్ లేదు అని ధ్రువకరించిన ప్రస్తుతం అధికారులు దళితులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.