- 9 ,10 తేదీలలో స్పెషల్ క్యాంపులు
- జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, వెలుగు: ఓటరు నమోదుకు నవంబర్ 9 ,10 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో తెలిపారు. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 29న ఓటరు జాబితా డ్రాఫ్టును ప్రకటించనున్న నేపథ్యంలో నవంబర్ 28 వరకు ఓటరు జాబితాలో అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
తుది ఓటరు జాబితా ప్రకటన కోసం బీఎల్వోలు ఇంటింటి సర్వే కార్యక్రమం ఈనెల 26లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ రోల్ ప్రకటనలో తప్పులు లేకుండా జాబితా ప్రకటించేల బిఎల్వోలు, సూపర్ వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు. డ్రాఫ్ట్ రోల్ లో తప్పులు లేకుండా తుది ఓటరు జాబితా ప్రకటన సులువు అవుతుందన్నారు.
ఈ క్యాంపుల్లో ఫారం 6, 7 ,8 అందుబాటులో ఉంటాయన్నారు. నూతన ఓటర్ నమోదుకు 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాజకీయ పార్టీల నాయకులు మహిళా సంఘాల సభ్యులతో ఓటర్ నమోదుపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు.