విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : సంతోష్

  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శనివారం నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు వండిన భోజన నాణ్యతను , స్టోర్ రూమ్ ని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో పరిశుభ్రతను పాటించి క్రమపద్ధతిలో సరుకులను అమర్చాలని సూచించారు.

అనంతరం విద్యార్థుల డార్మెటరీ ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. విద్యార్థులు అనారోగ్యంపాలు కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరాలు ఆరా తీశారు. మెడికల్‌‌‌‌‌‌‌‌ కిట్స్‌‌‌‌‌‌‌‌, మందులు, కనీస అవసరాలు అందుతున్నాయా అని తెలుసుకున్నారు. అనంతరం రాత్రి సమయంలో విద్యార్థులు చదువుకునే స్టడీ రూంను పరిశీలించారు. 

గురుకులాల్లో ఫుడ్ సూపర్​వైజర్, విద్యార్థుల మెస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ హారా నాణ్యత లో రాజీ పడొద్దన్నారు. బియ్యం, కూరగాయలు బాగు లేకుంటే తిరిగి పంపించాలని సూచించారు. పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని, ప్లేట్లు, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కునే విధంగా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని 
సూచించారు.