న్యాయ శాఖ ఈ-సేవా కేంద్రం ప్రారంభం

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ కోర్టులో న్యాయశాఖ ఈ–సేవా కేంద్రాన్ని ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రాజేశ్ బాబు ప్రారంభించారు. కక్షిదారుల సౌకర్యార్థం డిజిటల్ సేవలను అందించడానికి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆన్లైన్ ద్వారా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ప్రారంభించారు.

ఇందులో భాగంగానే కొల్లాపూర్ కోర్టులోనూ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జడ్జి తెలిపారు. కార్యక్రమంలో ఇన్​చార్జి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న గుంటి, కొల్లా పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నె శ్రీహరి, న్యాయవాదులు, సబ్ ఇన్​స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.