బడ్జెట్​లో మెదక్​కు గుండుసున్నా : బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్

మెదక్​టౌన్, వెలుగు : తెలంగాణ బడ్జెట్ లో మెదక్​కు గుండుసున్నా కేటాయించారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​ఎద్దేవా చేశారు. గురువారం రాష్ట్ర బడ్జెట్​ను నిరసిస్తూ పట్టణంలోని రాందాస్​ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం శ్రీనివాస్​ మాట్లాడుతూ.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని ఇచ్చిన హామీని మరిచిపోయారన్నారు.

మెదక్ ఖిల్లాను, ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పోచారంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మెదక్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి చిన్నచూపు ఉందని

మెదక్ రింగ్ రోడ్డుకు, మంజీరా ఎత్తిపోతలకు, కోంటూరు చెరువు,  గుండువాగుకు ఎన్ని నిధులు కేటాయించారో స్పష్టతనివ్వాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మెదక్​టౌన్​ప్రెసిడెంట్​నాయిని ప్రసాద్, హవేలి ఘన్​పూర్​మండల ప్రెసిడెంట్​రంజిత్​రెడ్డి, రాములు, శివకుమార్​,  కార్యకర్తలు పాల్గొన్నారు.