బ్యాడ్మింటన్ విజేతలకు ప్రైజ్‌ల అందజేత : కలెక్టర్ నగేశ్

  • అడిషనల్​ కలెక్టర్ నగేశ్ 

మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని జిల్లా అడిషనల్​ కలెక్టర్ నగేశ్ అన్నారు. బుధవారం స్థానిక పీఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో 68వ ఇంటర్ డిస్ట్రిక్ తెలంగాణ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ అండర్ 14 బాల, బాలికల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 జాతీయ స్థాయికి ఎంపికైన విజేతలకు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయన్నారు.  ప్రతి వ్యక్తి దైనందిన జీవితంలో క్రీడలపై ఆసక్తి పెంచుకుని ఆరోగ్యాన్ని పొందాలన్నారు. విజేతలు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.