సింగిల్​ పేరెంట్ ​చిన్నారులకు స్టడీ టేబుల్స్ పంపిణీ

పద్మారావునగర్, వెలుగు : పద్మారావునగర్ పార్కులో రాధే రాధే గ్రూప్​ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికులకు పలు రకాల వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అలాగే సింగిల్​పేరెంట్​చిన్నారులకు స్టడీ టేబుల్స్​పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ మెజీషియన్

సెంట్రల్​ఫిలిం సెన్సార్​ బోర్డు మెంబర్​సామల వేణు, తెలుగు రాష్ట్రాల ఇన్​కమ్​ట్యాక్స్​కమిషనర్ జీవన లాల్​హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్​జే ఇన్స్పిరేషన్​హ్యాండ్స్​చైర్మన్​ఉమా కార్తీక్, యాంకర్​ శిల్పిక, లయన్స్​ క్లబ్​ప్రతినిధులు పాల్గొన్నారు.