15 అంగన్​వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు

మిడ్జిల్, వెలుగు: మండలంలోని వేముల, మున్ననూరు, వాడ్యాలతో పాటు 15 అంగన్​వాడీ కేంద్రాల్లో కుళ్లిపోయి, పురుగులు పడిన గుడ్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. చిన్నారులు, గర్భిణులకు, బాలింతలకు సప్లై చేసిన గుడ్లను పగలగొట్టి చూడగా పురుగులు బయటపడ్డాయి. ఇలాంటి గుడ్లు తింటే తమ పరిస్థితి ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తరచుగా ఇలాగే జరుగుతున్నా కాంట్రాక్టర్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అంగన్​వాడీ టీచర్లను నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నాణ్యమైన గుడ్లు అందేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.