నకిలీ డిగ్రీ విమర్శలపై దూబే కౌంటర్​

నకిలీ డిగ్రీ విమర్శలపై దూబే కౌంటర్​

ఢిల్లీ: తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ మహువా మొయిత్రా, బీజేపీ ఎంపీ నిషికాంత్​ దూబే వివాదం మరింత ముదురుతోంది. మహువా డబ్బులు తీసుకుని మోదీకి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో దూబేవి నకిలీ డిగ్రీ పట్టాలు అంటూ ఆమె విమర్శించారు. దీనికి కౌంటర్​గా ఇస్తూ.. ‘మహువా డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారా లేదా? అన్నది ప్రశ్న. నకిలీ డిగ్రీల గురించి, అదానీ గురించి కాదు. విదేశీ ప్రయాణాలకు ఖర్చులు ఎవరు భరించారు..? ఆ ప్రయాణాల కోసం లోక్‌సభ స్పీకర్‌, విదేశాంగ శాఖ అనుమతులు తీసుకున్నారా..? వంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాలి. ఈ డిగ్రీ హెల్డర్​ డబ్బు కోసం మనస్సాక్షిని అమ్మేసుకున్నారు.. రేపు దేశాన్నికూడా అమ్మేయగలరు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దుబే.

ALSO READ :- ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి..తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర: మంత్రి గంగుల