జడ్చర్ల చైర్ పర్సన్​పై నెగ్గిన అవిశ్వాసం

జడ్చర్ల, వెలుగు : మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్  జిల్లా జడ్చర్ల బీఆర్ఎస్  మున్సిపల్  చైర్ పర్సన్  దోరేపల్లి లక్ష్మిపై అదే పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 27 మంది కౌన్సిలర్లు ఉండగా, 26 మంది హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఇందులో ఆరుగురు కాంగ్రెస్,‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకరు బీజేపీ కాగా.. మిగిలిన వారు బీఆర్ఎస్  పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. కార్యక్రమానికి చైర్ పర్సన్  గైర్హాజరయ్యారు.

అవిశ్వాసం నెగ్గినట్లు ప్రిసైడింగ్  అధికారి, మహబూబ్​నగర్   ఆర్డీవో నవీన్  తెలిపారు. పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్త చైర్ పర్సన్  ఎన్నిక ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో త్వరలో కొత్త చైర్ పర్సన్ ను ఎన్నుకుంటామని కౌన్సిలర్లు తెలిపారు.