- చైర్మన్ తప్ప డైరెక్టర్లందరూ హాజరు
చేర్యాల, వెలుగు: చేర్యాల పీఏసీఎస్చైర్మన్, వైస్చైర్మన్లపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ఆఫీసులో నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో 13 మందికి గాను 12 మంది హాజరయ్యారు. కొన్ని రోజుల కింద చైర్మన్వంగ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి నర్సయ్యలపై డైరెక్డర్లు అవిశ్వాసం పెట్టారు. ఈ రోజు డీసీవో కరుణ, అసిస్టెంట్ రిజిస్టార్ రఘోత్తంరెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాసం నిర్వహించారు.
హాజరైన డైరెక్టర్లు చేయి ఎత్తి ఓటు వేశారు. దీంతో చైర్మన్, వైస్చైర్మన్లపై పెట్టిన అవిశ్వాసం నెగ్గిందని జిల్లా అధికారులు తెలిపారు. కొత్త చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఈ నెల 14న ఓటింగ్ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు రవి, బాల్రెడ్డి, కృష్ణాగౌడ్, వసంత, నర్సింహులు, శ్రీనివాస్, నర్సింహులు గౌడ్, మాధవరెడ్డి, జ్యోతి, బాలనర్సయ్య, నర్సయ్య, కమలాకర్ పాల్గొన్నారు.