శ్రీతేజ్​ను పరామర్శించిన డైరెక్టర్​ సుకుమార్

సికింద్రాబాద్, వెలుగు: పుష్ప–-2 బెనిఫిట్ షో టైంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ డైరెక్టర్​సుకుమార్ పరామర్శించారు. గురువారం సికింద్రాబాద్​లోని కిమ్స్ కు వెళ్లి శ్రీతేజ్​ను చూశారు. డాక్టర్లతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

 సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన బాధారకరమని, బాలుడి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని సుకుమార్ చెప్పారు. కాగా డిసెంబరు 9న శ్రీతేజ్​తండ్రికి సుకుమార్ భార్య  రూ.5లక్షలు ఆర్థిక సాయం అందించారు. 15 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.