రామ్ చరణ్ హీరోగా శంకర్ రూపొందించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్‌తో పాటు మూడు పాటలను రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. శనివారం అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ‘చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం.. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్.. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్. శంకర్ గారు తీసిన జెంటిల్‌మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలోని క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది’ అని అన్నారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ‘శంకర్ గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా. ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా’ అని చెప్పాడు.
డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నా. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తమిళంలో, హిందీలో చిత్రాలు చేశాను. కానీ ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. అయినా తెలుగు ప్రేక్షకులు నా మీద ప్రేమను చూపిస్తూనే వచ్చారు.
చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అది జరగలేదు. ఆ తరువాత మహేష్ బాబుతో చేయాలని అనుకున్నా. ఆపై ప్రభాస్‌తో కరోనా టైంలో చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ మీదే ఈ చిత్రం ఉంటుంది. సోషియో, పొలిటికల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా గేమ్ చేంజర్ రాబోతోంది’ అని అన్నారు.
ఈ సంక్రాంతికి గట్టిగా కొట్టబోతున్నాం అని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు బుచ్చిబాబు సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశాడు. నటులు ఎస్‌జే సూర్య, అంజలి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Bringing the house down in true Dallas style! ?????#DHOP is DOPE ?#GameChanger https://t.co/lecy8K149A
— Sri Venkateswara Creations (@SVC_official) December 22, 2024