ఏపీలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో ట్వీట్ చేశారు. ‘23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 స్థానాలు ఇచ్చారు’ అని ఆర్జీవీ సెటైర్లు వేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించడంపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది.... మన అన్నగారిలా!! అంటూ విమర్శలు గుప్పించారు.
23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 ?
— Ram Gopal Varma (@RGVzoomin) February 24, 2024
రాబోయే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి24 వ తేదీన 118 సీట్లతో కూటమి తొలి జాబితాను కలిసి ప్రకటించారు. తొలి జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. 94 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభర్థులను చంద్రబాబు ప్రకటించారు.