Allu Arjun case : అల్లు అర్జున్ అరెస్ట్పై ఆర్జీవీ నాలుగు ప్రశ్నలు..

 సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన కేసులో  అల్లు అర్జున్ ను  హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..  ఈ కేసులో అల్లు అర్జున్ కు  నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం.. వెంటనే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఇవన్నీ హాట్ టాపిక్ గా మారాయి.  దీనిపై ఇవాళ టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు,సెలబ్రిటీలు కూడా ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. ఇక నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన దైన స్టైల్లో తన ఎక్స్ లో రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సంబంధిత అధికారులకు నాలుగు ప్రశ్నలు వేశారు. 

వర్మ వేసిన నాలుగు ప్రశ్నలివే..

  • పుష్కరాలు  , బ్రహ్మోస్తవాల్లాంటి  ఉత్సవాల్లో  తోపులాటలో  భక్తులు  పోతే  దేవుళ్ళని  అరెస్ట్  చేస్తారా ?
  • ఎన్నికల  ప్రచారాల  తొక్కిసలాటలలో  ఎవరైనా పోతే  రాజకీయ  నాయకులని  అరెస్ట్  చేస్తారా ?
  • ప్రీ రిలీజ్  ఫంక్షన్స్  లో ఎవరైనా పోతే  హీరో , హీరోయిన్లని  అరెస్ట్  చేస్తారా ?
  • భద్రత  ఏర్పాట్లు  పోలీసులు  ఆర్గనైజర్లు  తప్ప  ఫిలిం  హీరోలు ,ప్రజా  నాయకులూ  ఎలా  కంట్రోల్  చెయ్యగలరు ?


 మరో వైపు అల్లు అర్జున్ కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో కాసేపట్లో  చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ కాబోతున్నారు. ఇప్పటికే  బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందించారు లాయర్లు. మరో వైపు చంచల్ గూడ జైలు దగ్గరకు భారీగా చేరుకున్నారు అభిమానులు. అల్లు అర్జున్ రిలీజ్ కాబోతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.